నా తండ్రిని చంపిన వారిపై ఎలాంటి కోపం లేదు

నా తండ్రిని చంపిన వారిపై ఎలాంటి కోపం లేదు

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, తన తండ్రి రాజీవ్ గాంధీ మరణానికి కారకులైన వారిపై ఎలాంటి కోపం లేదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. తండ్రి రాజీవ్ చావు తనను తీవ్రంగా కలచి వేసిందని, అయితే దోషుల మీద తనకు ద్వేషం లేదన్నారు. ‘నాకు ఎవరి మీదా కోపం, ద్వేషం లేవు. నేను నా తండ్రిని కోల్పోయా. అది నాకు కష్టతరమైన సమయం. నాకు చాలా బాధగా అనిపించింది. కానీ అందుకు కారకులైన వారిపై మాత్రం ఎలాంటి కోపం లేదు. వారిని నేను క్షమిస్తున్నా. మా నాన్న నాలో బతికే ఉన్నారు. ఆయన నా ద్వారా మాట్లాడుతున్నారు’ అని రాహుల్ చెప్పారు.

పుదుచ్చేరిలో జాలరులతో రాహుల్ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సంభాషణలో ఓ స్టూడెంట్ రాహుల్‌‌కు ఆసక్తికర ప్రశ్న వేశారు. రాహుల్ మీకెవరైనా గర్ల్‌‌ఫ్రెండ్స్ ఉన్నారా అని స్టూడెంట్ అడగ్గా.. సమాధానంగా తనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పారు. గర్ల్‌‌ఫ్రెండ్ ఉందో లేదో క్లారిటీ ఇవ్వాలని ఆ స్టూడెంట్ తిరిగి అడగ్గా.. మళ్లెప్పుడైనా దీని గురించి మాట్లాడదామన్నారు. 1991, మే 21న రాజీవ్ ఎన్నికల ర్యాలీలో పాల్గొ్న్న సమయంలో ఓ మహిళ సూసైడ్ బాంబర్ అటాక్ చేయడంతో ఆయన చనిపోయారు.