కరోనాతోపాటు పెట్రోల్ ధరలను మోడీ సర్కార్ అన్‌లాక్ చేసింది

కరోనాతోపాటు పెట్రోల్ ధరలను మోడీ సర్కార్ అన్‌లాక్ చేసింది

కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

న్యూఢిల్లీ: దేశంలో బుధవారానికి కరోనా కేసుల సంఖ్య 4.56 లక్షలకు చేరుకుంది. అలాగే గత రెండు వారాల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో అధికార బీజేపీపై ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. మోడీ సర్కార్‌‌ను ఉద్దేశించి రాహుల్ ఓ ట్వీట్ చేశారు. ‘కరోనా వైరస్ మహమ్మారితోపాటు పెట్రోల్–డీజిల్ ధరలను మోడీ గవర్నమెంట్ అన్‌లాక్ చేసింది’ అంటూ ఆ ట్వీట్‌లో కేంద్రాన్ని రాహుల్ విమర్శించారు.

ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 79.76గా, డీజిల్ ధర రూ.79.88గా ఉంది. తాజాగా రూ. 0.48 పైసలు పెంచడంతో డీజిల్ ధర పెట్రోల్‌ను దాటేసింది. సాధారణ పరిస్థితులకు పూర్తి భిన్నంగా దీన్ని చెప్పొచ్చు. కాగా, తూర్పు లడాఖ్‌లోని గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో 20 మంది ఇండియా సైనికులు చనిపోవడంపై ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ రాహుల్ విమర్శలు ఎక్కు పెట్టిన సంగతి తెలిసిందే.