రైతులను శత్రువులుగా.. కార్పొరేట్లను మిత్రులుగా చూస్తున్నారు

రైతులను శత్రువులుగా.. కార్పొరేట్లను మిత్రులుగా చూస్తున్నారు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నిరసనల్లో గొంతెత్తిన వారిని శత్రువులుగా చూస్తున్నారని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. మోడీ సర్కార్ తన పెట్టుబడిదారులైన మిత్రులను మాత్రమే స్నేహితులుగా చూస్తోందన్నారు. మోడీ సర్కార్‌‌ను విమర్శిస్తూ రాహుల్ ఓ ట్వీట్ చేశారు. ‘మోడీ ప్రభుత్వం అసమ్మతిని చూపించే విద్యార్థులను జాతి వ్యతిరేకులుగా, దేని గురించైనా ఆరా తీసే పౌరులను అర్బన్ నక్సలైట్లుగా, వలస కూలీలను కొవిడ్ క్యారియర్లుగా చూస్తోంది. రేప్ బాధితులను అసలు పట్టించుకోవట్లేదు. నిరసనలు తెలియజేసే రైతులను ఖలిస్థానీలుగా ముద్ర వేస్తోంది. కానీ కార్పొరేట్ మిత్రులను మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్‌‌గా చూస్తోంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు.