హిమంత బిశ్వ శర్మ దేశంలోనే అత్యంత అవినీతి సీఎం: రాహుల్

హిమంత బిశ్వ శర్మ దేశంలోనే అత్యంత అవినీతి సీఎం: రాహుల్

అసోం: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ దేశంలోనే అత్యంత అవినీతిపరులైన ముఖ్యమంత్రులలో  ఒకరని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ అన్నారు. తన యాత్రకు బీజేపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. తనను ఎంత ఇబ్బంది పెడితే అంత మంచి జరుగుతుందన్నారు.  తనను కావాలనే కాలేజీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని అన్నారు. బీజేపీ తీరును యావత్ దేశం గమనిస్తోందన్నారు.  ఉద్దేశపూర్వకంగానే హేమంత్ సర్కార్ వ్యవహరిస్తోందని రాహుల్ విమర్శించారు. ఈనెల 11న ఆలయంలో దర్శనానికి అనుమతిచ్చిన సర్కార్ 20న తన అనుమతులను వెనక్కి తీసుకుందని మండిపడ్డారు. 

తాను అసోం  వెళ్లినప్పుడల్లా నిరుద్యోగం, భారీ అవినీతి, నిత్యవసర ధరల పెరుగుదల గురించి   అక్కడి  ప్రజలు పడుతున్న ఇబ్బందులను తనతో చెబుతారన్నారు రాహుల్.  అసోంలో ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వలేదన్నారు. అసోం సమస్యలపైనే తాము మాట్లాడుతున్నామన్నారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు హేమంత్ సర్కార్ అడుగడగున అడ్డుకుంటోంది.   జనవరి 23వ తేదీ మంగళవారం రాజధాని గౌహతి సమీపంలోని ఖానాపరాలో భారత్ జోడో యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు కాంగ్రెస్ శ్రేణులపై లాఠీ చార్చ్ చేశారు.  వర్శిటీ బయటే మాట్లాడిన రాహుల్  తాను విద్యార్థులను కలిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన  ఇబ్బందులేంటని  ప్రశ్నించారు.