హైదరాబాద్ లో ఆటోలో తిరిగిన రాహుల్ గాంధీ

హైదరాబాద్ లో ఆటోలో తిరిగిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ప్రజలతో తిరిగారు. ఈ క్రమంలోనే.. 2023, నవంబర్ 28వ తేదీ మంగళవారం ఉదయం.. హైదరాబాద్ లో పారిశుధ్య కార్మికులు, ఆటోవాలాలతో సమావేశం అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో భాగంగా.. అందరికీ న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. 

ఈ సమావేశం తర్వాత.. అక్కడే ఉన్న ఓ ఆటోలో ప్రయాణించారు రాహుల్ గాంధీ. జూబ్లీహిల్స్ ఏరియాలో కొద్దిసేపు ఆటోలో తిరిగారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆటో డ్రైవర్ గా జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటీ.. ప్రభుత్వం నుంచి ఎలా సహకారం కావాలి అనే విషయాలను.. ఆ ఆటో డ్రైవర్ ను అడిగి తెలుసుకున్నారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఆటో తిరిగిన రాహుల్.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి 12 వేల రూపాయల ఆర్థిక సాయం చేయనున్నట్లు హామీ ఇచ్చారు. 

Also Read :- మొదటి మంత్రివర్గంలోనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం: ప్రియాంక గాంధీ