
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 2023, సెప్టెంబర్ 17వ తేదీ ఆదివారం హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్నారు రాహుల్ గాంధీ. 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
ఎయిర్ పోర్టు నుంచి సిటీలోని తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకుంటారు. అక్కడ సీడబ్ల్యూసీ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతరం అక్కడే రాత్రికి బస చేస్తారు. 17వ తేదీ మధ్యాహ్నం తుక్కుగూడలోని కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొంటారు. ఈ సభ కంటే ముఖ్యంగా.. హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగటం విశేషం. తుక్కుగూడ సభ అనంతరం 17వ తేదీ రాత్రి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు రాహుల్ గాంధీ.
Also Read :- అమిత్ షా టూర్ ఫిక్స్..ఒక రోజు ముందుగానే హైదరాబాద్కు..
సీడబ్ల్యూసీ మీటింగ్, తుక్కుగూడ సభలో సోనియాగాంధీ కూడా పాల్గొంటున్నారు. ఈ సభలోనే ఐదు గ్యారెంటీలను ప్రకటించనున్నారు.