
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కేరళలోని వయానాడ్ పర్యటనకు వెళ్లనున్నారు. మూడ్రోజుల విజిట్‌లో భాగంగా తన పార్లమెంటరీ నియోజకవర్గంలో కరోనా పరిస్థితులపై రివ్యూ చేయనున్నారు. స్పెషల్ ఫ్లయిట్ ద్వారా కోజికోడ్ చేరుకొని అక్కడి నుంచి మలప్పురం రోడ్డు ద్వారా నేరుగా రివ్యూ మీటింగ్‌కు వెళ్లనున్నారు. రాహుల్ సొంత ఎంపీ నిధులతో వయానాడ్‌లోని ముండేరి స్కూల్‌లో ఓ కొత్త బ్లాక్‌ను నిర్మించారు. అయితే గత వారం ఈ బ్లాక్ ఆన్‌లైన్ ప్రారంభోత్సవాన్ని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నిలిపివేసింది. హెల్త్ ప్రోటోకాల్స్ పాటించకపోవడంతోపాటు బ్లాక్ ప్రారంభోత్సవం గురించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదనే కారణంతో వయానాడ్ కలెక్టర్ అదీలా అబ్దుల్లా కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఇలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.