మన సైనికులను ఎక్కడ,ఎందుకు చంపారు: రాహుల్‌

మన సైనికులను ఎక్కడ,ఎందుకు చంపారు: రాహుల్‌
  • కేంద్రాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్‌

న్యూఢిల్లీ: ఇండియా – చైనా సరిహద్దుల్లోని గాల్వాన్‌లో చైనా సైనికులు పాల్పడ్డ దాడికి సంబంధించి ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ కేంద్ర పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ విషయమై శనివారం ఉదయం కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రాహుల్‌ ట్వీట్లు చేశారు. “ ప్రధాని ఇందడియన్‌ టెరిటరీనీ చైనా దురాక్రమణకు అప్పగించారు. 1. మన సైనికులను ఎందుకు చంపారు? 2. ఎక్కడ చంపారు? ” అంటూ ట్విట్టర్‌‌ ద్వారా ప్రశ్నించారు. మన టెరిటరీలోకి ఎవరూ ఎంటర్‌‌కాలేదు, ఏమీ తీసుకెళ్లలేదు అని మోడీ చెప్పిన విషయాన్ని రాహుల్‌ పోస్ట్‌ చేస్తూ ఈ ప్రశ్నలు అడిగాడు. చైనా ప్రీప్లాన్డ్‌గా దాడి చేస్తే ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని, దానికి మన సైనికులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని రాహుల్‌ గాంధీ శుక్రవారం ట్వీట్‌ చేశారు.