రాహుల్​ గాంధీ ఏం మొఖం పెట్టుకుని ఖమ్మం వస్తున్నడు: పొంగులేటి సుధాకర్​రెడ్డి

రాహుల్​ గాంధీ ఏం మొఖం పెట్టుకుని ఖమ్మం వస్తున్నడు: పొంగులేటి సుధాకర్​రెడ్డి

తోడు దొంగల్లా కాంగ్రెస్​, బీఆర్ఎస్​ నాటకాలు 
బీజేపీ  జాతీయ నేత పొంగులేటి సుధాకర్​రెడ్డి

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఇతర దేశాల్లో మన దేశాన్ని చులకన చేసి మాట్లాడి దేశ ప్రతిష్టను భంగపరిచిన రాహుల్​గాంధీ ఏం మొఖం పెట్టుకుని ఖమ్మం వస్తున్నారని బీజేపీ  జాతీయ నాయకుడు, తమిళనాడు రాష్ర్ట సహ ఇన్​చార్జి పొంగులేటి సుధాకర్​రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఖమ్మం పార్టీ ఆఫీస్​లో ఆయన మాట్లాడుతూ రాహుల్​గాంధీ దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పిన తరువాతే ఖమ్మం గడ్డపై అడుగుపెట్టాలన్నారు. 

ఖమ్మంలో జరగనున్న కాంగ్రెస్​సభ కొందరి నాయకుల ధన గర్జన సభగా మారిందన్నారు. రాష్ర్టంలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలు తోడుదొంగల్లా నాటకాలు ఆడుతున్నాయన్నారు.  జులై 8న హన్మకొండలో నిర్వహించనున్న మోడీ   బహిరంగసభకు పార్టీ శ్రేణులు, సానుభూతిపరులు అత్యధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, రుద్ర ప్రదీప్​, కడగంచి రమేశ్, మందా సరస్వతి పాల్గొన్నారు.