వయనాడ్ లో రాహుల్ గాంధీ విజయం

వయనాడ్ లో రాహుల్ గాంధీ విజయం

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. రాహుల్ ఈ ఎన్నికల్లో యూపీలోని అమేథీ నుంచే కాకుండా కేరళలోని మరో నియోజకవర్గం నుంచి కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న క్రమంలో రాహుల్  వయనాడ్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించినట్లుగా తెలిసింది. మరోవైపు కాంగ్రెస్‌ కు కంచుకోట అయిన అమేఠీలో మాత్రం రాహుల్‌ ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. ఇక్కడ భాజపా నేత స్మృతి ఇరానీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.