
మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మనకు తెలుసు. వీరంత ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో ఓ చోట నివసిస్తుంటారు. అప్పుడప్పుడు ఒకరికొకరు తారసపడుతుంటారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీని పోలిన వ్యక్తిని ఎప్పుడైనా చూశారా..?
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని పోలిన ఓ వ్యక్తి ఆకట్టుకున్నాడు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర యూపీలో ముగిసింది. హర్యానాలోకి ఎంటరైంది. రాహుల్ యాత్రలో డూప్ రాహుల్ కనిపించడంపై ప్రజలు ఆశ్చర్యపోయారు. అచ్చం రాహుల్ గాంధీ మాదిరిగానే ఉన్న అతన్ని చూసి షాకయ్యారు.
రాహుల్ గాంధీ పోలికలున్న అతని పేరు ఫైజర్ చౌదరి. మీరట్ కు చెందిన ఫైజర్ చౌదరీ ఘజియాబాద్‌లో జోడో యాత్రలో పాల్గొన్నాడు. రాహుల్ గాంధీలాగే టీషర్ట్ ధరించి పెరిగిన గడ్డంతో దర్శనమివ్వడంతో స్థానికులు రాహుల్ గాంధీ అని భ్రమ పడ్డారు. దగ్గరకు వచ్చి పరీక్షించి చూసి డూప్ రాహుల్ అంటూ నవ్వుకున్నారు. మరికొందరు అతనితో సెల్ఫీలు దిగారు. ఇంకొందరు షేక్‌హ్యాండిచ్చారు. ఈ సందర్భంగా తాను రాహుల్ గాంధీని కాదని...తన పేరు ఫైజల్ చౌదరి అంటూ చెప్పుకొచ్చాడు.