రాహుల్ గాంధీకి అస్వస్థత.. జార్ఖండ్ ర్యాలీకి దూరం

రాహుల్ గాంధీకి అస్వస్థత.. జార్ఖండ్  ర్యాలీకి దూరం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆదివారం (ఏప్రిల్ 21)  జార్ఖండ్ లోని రాంచీలో జరగనున్న విపక్షాల ఇండియా కూటమి ఐక్యతా ర్యాలీకి కాంగ్రెస్  అధినేత రాహుల్ గాంధీ హాజరు కాలేరని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ట్విట్టర్ లో తెలిపారు. ఆనారోగ్యం కారణంగా సాత్నా, రాంచీలలో తన పర్యటనలను రద్దు చేసుకున్నారు రాహుల్ గాంధీ. 

రాంచీలో ఆదివారం జరిగే ఇండియా బ్లాక్ ర్యాలీలో కనీసం 14 రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి. గత నెలలో ఢిల్లీలో జరిగిన లోక్ తంత్ర బచావో ర్యాలీ తర్వాత ప్రతిపక్ష మిత్రపక్షాలతో రాంచీలో జరిగే ర్యాలీ రెండో పెద్ద సభ. 

రాహుల్ గాంధీ అస్వస్థత  సమాచారాన్ని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంచార్జీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్విట్టర్ లోతెలిపారు. రాముల్ ఆకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారని ఆయన ఇండియా కూటమీ మిత్రపక్షాల సమావేశంలో పాల్గొనలేరని తెలిపారు. 

Also Read:మణిపూర్‌లోని ఆ నియోజవర్గంలో రీపోలింగ్.. ఎందుకంటే

అయితే రాహుల్ గాంధీ స్థానంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సభల్లో పాల్గొంటారని తెలిపారు. చివరి నిమిషంలో రాహుల్ ఈవెంట్ నుంచి వైదొలగడంతో ప్రతి పక్ష కూటమిలో ఐక్యత గురంచి రాజకీయ వర్గాల్లో అనేక చర్చలకు తావిస్తోంది.