దేశాన్ని అగాధంలోకి నెట్టారు: రాహుల్ గాంధీ

దేశాన్ని అగాధంలోకి నెట్టారు: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కోవడంలో మోడీ సర్కార్ విఫలమైందంటూ కాంగ్రెస్ విమర్శలకు దిగుతున్న సంగతి తెలిసిందే. మహమ్మారి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు తూర్పారబట్టారు. కరోనా అపూర్వమైన చాలెంజ్ అని, ప్రధాని మోడీ నాయకత్వంలో పక్కా ప్లానింగ్‌‌తో వైరస్‌‌‌పై పోరాడుతున్నామని అమిత్ షా అన్నారు. ఈ నేపథ్యంలో షా వ్యాఖ్యలపై రాహుల్ మండిపడ్డారు. ‘కరోనాపై మోడీ గవర్నమెంట్ పక్కా ప్లానింగ్‌‌తో చేసిన యుద్ధం ఇండియాను తీవ్ర అగాధంలోకి నెట్టింది. జీడీపీ 24 శాతం మేర పడిపోయింది. 12 కోట్ల జాబ్స్ పోయాయి. 15.5 లక్షల కోట్ల అదనపు లోన్లు ఇచ్చారు. కరోనా రోజువారీ కేసులు, మరణాల్లో ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే ఎక్కువగా ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోపాటు మీడియాకు ప్రతిదీ సవ్యంగా ఉన్నట్లే కనిపిస్తున్నాయి’ అని రాహుల్ ట్వీట్ చేశారు.