
ఢిల్లీలో మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడతో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. త్వరలోనే సాధారణ ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో పార్టీలన్నీ వ్యూహాలను ముమ్మరం చేస్తున్నాయి. అధికార బీజేపీ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ పావులు కదుపుతున్నాయి. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్, జేడీఎస్.. లోక్‌సభ ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. జేడీఎస్ నేత, మాజీ ప్రధాని దేవెగౌడను కలిశారు. ఇవాళ (బుధవారం) ఢిల్లీలోని దేవెగౌడ నివాసానికి చేరుకున్న రాహుల్.. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య సీట్ల పంపకాలపై ఆయనతో చర్చిస్తున్నారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి.