కేజ్రీవాల్ యూటర్న్ తీసుకున్నారు: రాహుల్ గాంధీ

కేజ్రీవాల్ యూటర్న్ తీసుకున్నారు: రాహుల్ గాంధీ

ఢిల్లీ లోక్ సభ సీట్ల పంపకాలపై కాంగ్రెస్ ఆప్ మధ్య పొత్తుకుదరలేదు. ఇందుకు గాను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆప్ కు 4 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీగా ఉన్నట్లు రాహుల్ తెలిపారు. అయితే ఇందుకు కేజ్రీవాల్ ఒప్పుకోలేదని…  మరోసారి ఆయన యూ టర్న్ తీసుకున్నారని ట్వీట్ చేశారు. ఎప్పటికైనా కాంగ్రెస్ తలుపులు ఆప్ కోసం తెరుచుకుని ఉంటాయని… నిర్ణయాన్ని తొందరగా తీసుకోవాలని సమయం లేదని కేజ్రీవాల్ ను కోరారు రాహుల్.

ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్..  ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి పబ్లిసిటీకి ధనం ఎక్కడ్నుంచి వస్తుందని రాహుల్ ప్రశ్నించారు. ప్రజల డబ్బును దొంగిలించి నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటివారికి మోడీ కట్టబెట్టారని ఆరోపించారు.

పాకిస్తాన్ గురించి మాట్లాడడం ఆపేయండి: ప్రియాంక గాంధీ
BJP నిజంగా జాతీయవాద పార్టీ అయితే… ఎన్నికల ప్రచారంలో పాకిస్తాన్ గురించి మాట్లాడడం ఆపేయాలన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. మహిళలు, యువత, రైతులకు మోడీ ఏం చేస్తారో చెప్పాలని సూచించారు. బీజేపీ నేతలంతా నిజంగా జాతీయవాదులే అయితే… స్వాతంత్ర్య సమరయోధులను, సైనికులను గౌరవించాలన్నారు.