లోక్‌సభలో శివసేన ప్లోర్ లీడర్ గా రాహుల్ షెవాలే

లోక్‌సభలో శివసేన ప్లోర్ లీడర్ గా రాహుల్ షెవాలే

లోక్‌సభలో శివసేన ప్లోర్ లీడర్ గా రాహుల్ షెవాలేను  స్పీకర్ ఓం బిర్లాను గుర్తించినట్లుగా మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే తెలిపారు.  ఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడిన షిండే ఈ విషయాన్ని వెల్లడించారు.  శివసేనకు చెందిన 19 మంది ఎంపీలలో 12 మంది ఏకనాథ్-షిండే వర్గంలో చేరారు. షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్‌ షిండే సహా 12 మంది మంగళవారం స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి లోక్‌సభలో తమ పార్టీ నేతగా వినాయక్‌ రౌత్‌ స్థానంలో రాహుల్‌ షెవాలేను గుర్తించాలని కోరారు.  ఈ మేరకు  ఓం బిర్లాకు లేఖ రాశారు. ఇందుకు స్పీకర్‌ కూడా సమ్మతించారని ఎంపీ  హేమంత్‌ గాడ్సే తెలిపారు. అటు వినాయక్‌ రౌత్‌ సోమవారం రాత్రి స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి శివసేన పార్లమెంటరీ పార్టీ నేతగా తనను, పార్టీ చీఫ్‌ విప్గా రాజన్‌ విచారేను గుర్తించాలని వినతి పత్రం అందజేశారు.