జో బైడైన్ ఇంటిపై రైడ్స్

జో బైడైన్ ఇంటిపై రైడ్స్
  • స్వయంగా రాసిన కీలక నోట్స్ కూడా..
  • అవన్నీ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటివనే అనుమానాలు
  • ఆ డాక్యుమెంట్లలో రహస్యాలేం లేవు : అమెరికా ప్రెసిడెంట్​ బైడెన్​

వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎఫ్​బీఐ ఏకంగా అధ్యక్షుడు జో బైడైన్ ఇంటిపై రైడ్స్​ చేసింది. నార్త్​ కరోలినా స్టేట్​లోని విల్మింగ్టన్​ నగరంలో ఉన్న బైడెన్ ​నివాసంలో దాదాపు 13 గంటలపాటు జరిపి సోదాల్లో ప్రభుత్వ వ్యవహారాలతో ముడిపడిన 6 సీక్రెట్​ పేపర్స్ (క్లాసిఫైడ్​ డాక్యుమెంట్స్​) ను  స్వాధీనం చేసుకున్నారు. వైస్ ప్రెసిడెంట్​గా ఉన్న సమయంలో ​ స్వయంగా బైడెన్​ రాసుకున్న కీలక నోట్స్​ను కూడా ఎఫ్​బీఐ అధికారులు తీసుకెళ్లారు. ఈ వివరాలను ప్రెసిడెంట్​ పర్సనల్​ లాయర్​ బాబ్​ బౌర్​ ధ్రువీకరించారు.

బైడెన్​ నివాసంలోని లైబ్రరీ నుంచి ఆరు  డాక్యుమెంట్లను ఎఫ్​బీఐ స్వాధీనం చేసుకుందని..  తదుపరి విచారణ కోసం వాటిని న్యాయశాఖకు సమర్పించిందని తెలిపారు. ఈ డాక్యుమెంట్లన్నీ అమెరికా సెనెటర్​గా, వైస్ ప్రెసిడెంట్​గా(2009 ‌‌‌‌నుంచి 2016) బైడెన్​ వ్యవహరించిన సమయం  నాటివన్నారు. ఈ  దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని బైడెన్​ తమకు నిర్దేశించారని, ఆ ప్రకారమే నడుచుకుంటున్నామని బాబ్​ బౌర్​ వెల్లడించారు. ఇక ఈ రైడ్స్​పై న్యాయశాఖ ప్రత్యేక న్యాయవాది రిచర్డ్​ సౌబెర్​ కూడా స్పందించారు. సోదాలు జరిగిన సమయంలో ఇంట్లో బైడెన్​ లేరన్నారు. కాగా, బైడెన్​ ఇంట్లో తొలిసారిగా 2022 నవంబరు2న 10 క్లాసిఫైడ్​ డాక్యుమెంట్స్ దర్యాప్తు అధికారులకు​ దొరికాయి.