రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు హాస్పిటల్స్ లో తనిఖీలు

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు హాస్పిటల్స్ లో తనిఖీలు

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు హాస్పిటల్స్ లో వైద్యశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఫేక్ ఆస్పత్రుల మూసివేతకు రంగం సిద్ధం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్, క్వాలిఫైడ్ డాక్టర్లు, స్టాఫ్ లేకుండా నడుస్తున్న ప్రైవేటు హాస్పిటల్స్, క్లినిక్స్, డయాగ్నస్టిక్ సెంటర్లపై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 10 రోజుల పాటు తనిఖీలు చేయాలని ఇప్పటికే వైద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ఆఫీసర్లు, డిప్యూటీ DMHOలతో ఏర్పాటు చేసిన టీమ్స్ రైడ్స్ చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం హాస్పిటల్స్ నడుస్తున్నాయా.. లేదా..? డాక్టర్లు, స్టాఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారు. బయో వేస్ట్ మేనేజ్ మెంట్ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించి నోటీసులు ఇస్తున్నారు. 

వైద్యాధికారులు జిల్లా కేంద్రాల్లోని హాస్పిటల్స్ ను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అనుమతి లేని మూడు ప్రైవేటు హాస్పిటల్స్, ఒక డయాగ్నస్టిక్ సెంటర్ ను సీజ్ చేశారు. పట్టాలు లేని డాక్టర్లు హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారని తెలిపారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. 

మరోవైపు ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. సూర్యాపేటలో పలు ప్రైవేటు హాస్పిటల్స్ పై రైడ్స్ చేశారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా.. పేషంట్లను చూస్తున్న నల్లగొండ జిల్లా కేతేపల్లి మెడికల్ ఆఫీసర్ విజయ్ ని అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ ప్రైవేటు ఆసుపత్రిని సీజ్ చేశారు. మరికొన్ని ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.