రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITS) అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 25.
పోస్టులు: 400 (అసిస్టెంట్ మేనేజర్)
విభాగాలు: సివిల్ 120, ఎలక్ట్రికల్ 55, సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ (ఎస్ & టీ) 10, మెకానికల్ 150, మెటలర్జీ 26, కెమికల్ 11, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) 14, ఫుడ్ టెక్నాలజీ 12, ఫార్మా 02.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/బోర్డు నుంచి సంబంధిత ఇంజనీరింగ్/టెక్నాలజీ విభాగంలో పూర్తి సమయం బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండటంతోపాటు రెండేండ్ల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 2025, డిసెంబర్ 25 నాటికి 45 ఏండ్లు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్–సర్వీస్‌మెన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 26.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు రూ.300.
లాస్ట్ డేట్: డిసెంబర్ 25.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.rites.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.
