
సికింద్రాబాద్, వెలుగు : మిచాంగ్ తుఫాన్ కారణంగా రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ మధ్య పరిధిలోని వివిధ మార్గాల్లో నడిచే పలు రైళ్లను శుక్రవారం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
న్యూ టిన్ -సుకియా ఎస్ఎంవీటీ బెంగుళూరు, ఆగర్తాలా- ఎస్ఎంవీటీ బెంగుళూరు, న్యూ జల్పాయ్ గిరి- చెన్నై సెంట్రల్ రైళ్లను రద్దు చేశారు. అలాగే.. ఈ నెల 9న అగర్తాలా- కేఎస్ఆర్–బెంగుళూరు సిటీ రైళును కూడా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.