- లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో నిర్ణయం
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగించడంతో రైల్వే శాఖ 39 లక్షల టికెట్లను క్యాన్సిల్ చేయనుంది. ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ సడలింపు ఉంటుందనే ఉద్దేశంతో బుక్కింగ్స్ ఓపెన్ చేయగా.. 39లక్షల మంది టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో బుక్ చేసుకున్న వారికి మొత్తం డబ్బులు వెనక్కు ఇస్తామని చెప్పారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి ఆటోమేటికగా రీఫండ్ వస్తుందని, కౌంటర్లలో టికెట్లు తీసుకున్న వారు జులై 31లోగా రిఫండ్‌కు అప్లై చేసుకోవాలని చెప్పారు. లాక్‌డౌన్‌కు సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాతే తిరిగి బుకింగ్స్ మొదలు పెడతామని రైల్వే శాఖ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. క్యాన్సిల్ అయినట్లు ప్రకటించని ట్రైన్ టికెట్స్‌కు కూడా రీఫండ్ ఇస్తామని అన్నారు.
