
సికింద్రాబాద్, వెలుగు: కాచిగూడ, మహబూబ్‌నగర్ ,-దేవరకద్ర -కృష్ణా సెక్షన్ లో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ అధికారులతో కలిసి బుధవారం తనిఖీలు చేశారు. కాచిగూడ-– కృష్ణాసెక్షన్‌లో సిగ్నలింగ్ వ్యవస్థ, భద్రత అంశాలను పరిశీలించారు. అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా మరికల్ రైల్వే స్టేషన్ ను సందర్శించి పాయింట్ నంబర్ 102ను పరిశీలించారు.
జక్లెర్ , మాగనూరు రైల్వే స్టేషన్లను సందర్శించిన అరుణ్ కుమార్ జైన్.. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. దేవరకద్ర రైల్వేస్టేషన్ ను సమగ్రంగా తనిఖీ చేసి ప్యాసింజర్లకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలపై అధికారులతో చర్చించారు.