కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి టెండర్లు పిలిచాం

కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి టెండర్లు పిలిచాం

కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి టెండర్లు పిలిచామని, త్వరలో ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భూ కేటాయింపు సకాలంలో కేటాయించక పోవడంతో కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణం  ఆలస్యం  జరిగిందన్నారు. ఇటీవల భూమిని రైల్వే శాఖకు అప్పగించారని, అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన చెప్పారు. ఇచ్చిన హామీలకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఇవాళ(శుక్రవారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీలు అరవింద్‌, సోయం బాబురావు తదితరులతో కలిసి మీడియాతో మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ మాట్లాడారు. 2009-2014 వరకు తెలంగాణను యూపీఏ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. రైల్వే పనులకు సంబంధించి ఉమ్మడి ఏపీలో రూ.886 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. రైల్వే డబ్లింగ్‌ పనులైతే ఒక్కటి కూడా చేపట్టలేదన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో రైల్వే శాఖ చేపట్టిన వివిధ పనులకు రూ.1,110 కోట్లను మోడీ ప్రభుత్వం  కేటాయించిందని మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ చెప్పారు.  అంతేకాదు MMTS పనుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించడం లేదన్నారు. MMTS కోసం కేంద్రం తన వాటాగా రాష్ట్రానికి రూ.631 కోట్లు కేటాయించిందన్నారు.

 మరిన్ని వార్తల కోసం..

ముందు మావోళ్లకే దళితబంధు అంటున్న లీడర్లు