రైళ్లపై రాళ్లు రువ్విన కేసులో..33 మంది అరెస్టు

రైళ్లపై రాళ్లు రువ్విన కేసులో..33 మంది అరెస్టు

పద్మారావునగర్, వెలుగు: రైళ్లపై రాళ్లు రువ్వడం, ట్రాక్​లపై ప్రమాదకర వస్తువులు ఉంచడం వంటి ఘటనలపై రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) కఠిన చర్యలు తీసుకుంటోంది. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 54 రాళ్ల దాడి కేసులు నమోదు కాగా,  ఇప్పటివరకు 30 కేసుల్లో 33 మందిని అరెస్టు చేశారు. మరో 30 మంది పరారీలో ఉన్నారు. 

అలాగే ట్రాక్​పై వస్తువుల ఉంచిన 8 కేసుల్లో ఆరింటిని ఛేదించి 7 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులు కోర్టులో విచారణలో ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌‌‌‌‌‌‌‌ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు.  

ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల రక్షణకు ప్రాధాన్యమిస్తామని, ఇలాంటి సంఘటనలను అరికట్టేందుకు ప్రజలు 139 నంబర్​కు సమాచారం అందించాలని సూచించారు.