వర్షం మిగిల్చిన విషాదం: 74 మంది మృతి.. రూ.10 వేల కోట్ల ఆస్తి నష్టం

వర్షం మిగిల్చిన విషాదం: 74 మంది మృతి.. రూ.10 వేల కోట్ల ఆస్తి నష్టం

హిమాచల్​ ప్రదేశ్​లో కురిసిన భారీ వర్షాలకు 74 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. వర్షాలకు 10వేల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సిమ్లాలోని శివాలయం శిథిలాల నుంచి మరో మృతదేహాన్ని బయటకు తీయడంతో మృతుల సంఖ్య 74కి చేరుకుంది. 

చంబా జిల్లాలో మరో ఇద్దరు మృతి చెందారు. ఆలయ శిథిలాల మధ్య ఇంకా ఎనిమిది మంది సజీవ సమాధి అయ్యారని భావిస్తున్నారు. చంబా జిల్లాలో రెండు మరణాలు సంభవించాయి.  జూన్ 24న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి వర్షాలు సృష్టించిన బీభత్సంతో 217 మంది మరణించారు. 

సిమ్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  భారత సైన్యం, వైమానిక దళం,  ఇతర రెస్క్యూ సిబ్బంది కాంగ్రా జిల్లాలోని ఫతేపూర్, ఇండోరాలోని పాంగ్ డ్యామ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 2,074 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

ముఖ్యమంత్రి సుఖ్వీందర్​సింగ్ సుఖు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. మొత్తంగా రూ. 10 వేల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.