అతి భారీ వర్షాలు..అత్యంత భారీ వర్షాలు.. మరో రెండ్రోజులు కుండపోత వానలే..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..

అతి భారీ వర్షాలు..అత్యంత భారీ వర్షాలు.. మరో రెండ్రోజులు కుండపోత  వానలే..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..

తెలంగాణలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు భారీ వర్షం పడే అవకాశముందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా జులై 27వ తేదీ గురువారం, జులై 28వ తేదీ  శుక్రవారాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని పేర్కొంది.  పలుచోట్ల భారీ వర్షాలు, కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రానికి రెండు రోజులపాటు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని.. దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. వర్షాలకు తోడు పలుచోట్ల గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రకటించింది. 

మోస్తరు వర్షాలు:

నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆదిలాబాద్, ములుగు జిల్లాలు

 భారీ వర్షాలు: 

ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, భద్రాద్రి, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్, గద్వాల జిల్లాలు

అతి భారీ వర్షాలు:

సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాలు