వాయుగుండంగా మారిన అల్పపీడనం

వాయుగుండంగా మారిన అల్పపీడనం

బంగాళాఖాతంలో నిన్నటి వరకూ కొనసాగిన అల్పపీడనం… ఇప్పుడు వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బుధవారం(రేపు) వరకు తుఫానుగా మారుతుందన్నారు.  దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

ఒడిశాలోని పారాదీప్‌ కు దక్షిణ ఆగ్నేయంగా 950 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం, ఒడిశా , పశ్చిమ బెంగాల్ వైపునకు కదులుతోందని తెలిపారు. ఇది తీరం దాటేందుకు మరో రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.