రాష్ట్రానికి వర్ష సూచన..3 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

రాష్ట్రానికి వర్ష సూచన..3 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

రాష్ట్రంలో రాబోయే 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో  ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. 

ఏ ఏ జిల్లాల్లో వర్షాలు..

తెలంగాణలోని కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయ్..

వర్షాలు పడే జిల్లాల్లో  గంటకు30  నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర దక్షిణ ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలో మీటర్ల  ఎత్తు వద్ద ఏర్పడిందని పేర్కొంది. మరోవైపు మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో  గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ తో పాటు పరిసర  చుట్టు పక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.