హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం.. ట్రాఫిక్ జామ్ తో వాహనదారుల ఇక్కట్లు

 హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం.. ట్రాఫిక్ జామ్ తో వాహనదారుల ఇక్కట్లు

గ్రేటర్ హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే సమయం కావడంతో వర్షం జోరుగా పడుతోంది. చాలాచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 

మరోవైపు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నిలిచిన నీరు, బురదతో హైదరాబాద్ పబ్లిక్ అవస్థలు అన్ని ఇన్నీ కావు.