
శబరిమలలో వర్షం పడుతుంది. వర్షంలోనే భక్తులు పంపా నదిలో స్నానం చేస్తున్నారు. కేరళ (Kerala)లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల (Sabarimala Temple)లో భక్తుల (devotees) రద్దీ కొనసాగుతోంది. స్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతోంది. ఈ ఏడాది శబరి కొండకు భక్తులు అధికంగావెళుతున్నారు. ఈఏడాది తొక్కిసలాట జరిగిన తరువాత అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొన్నటి దాకా ( డిసెంబర్ 15 కు ముందు) స్వామి దర్శనానికి 16 గంటలకు పైగా పట్టేది. ప్రస్తుతం అధికారులు చర్యలు తీసుకోవడంతో ఈ రోజు ( డిసెంబర్ 17)న నాలుగు గంటలు పడుతుంది.
ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భక్తుల రద్దీ అధికంగా ఉంది. రద్దీ ఎక్కువ కావడంతో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్ల నిర్వహళణ, భక్తులను నిలువరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా కిలోమీటర్ల మేర భారీగా క్యూలైన్లు దర్శనమిచ్చాయి.. రద్దీకి తోడు ట్రాఫిక్ సమస్యలు భక్తులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. వాహనాల రద్దీ కారణంగా భారీ ట్రాఫిక్‌జామ్ అవ్వడంతో పంబ చేరుకుని తిరిగి వెళ్లాలంటే చాలా కష్టమవుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.