యాదాద్రి జిల్లాలో జోరు వాన..కూలిన గోడలు

యాదాద్రి జిల్లాలో జోరు వాన..కూలిన గోడలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో పలుచోట్ల శనివారం జోరువాన కురిసింది. మండలంలోని వీరవెల్లి గ్రామంలో కురిసిన వానకు కొన్ని పాత ఇండ్లు కూలిపోయాయి. మరికొన్ని గోడల పెచ్చులు ఊడాయి. శనివారం రాత్రి వర్షం పడటంతో గాజరాజు చంద్రమ్మ ఇంట్లోకి నీరు చేరడంతో సామాగ్రి అంతా అస్తవ్యస్తం అయ్యింది. ఈ సందర్భంగా స్పందించిన గ్రామ అధికారులు ..యువత ఆమెకు తోచిన సాయం అందించారు.

అలాగే సోకం గురువు ఇస్తారి ఇంట్లోని పాత గోడల పెచ్చులు ఊడాయి. రేకులు కూలాయి. ఇంట్లో ఎవ్వరూలేకపోవడంతో ప్రమాదం తప్పింది. 30 రోజుల ప్లానింగ్ లో భాగంగా ఇప్పటికే పలు ఇండ్లను కూల్చేశామని మరిన్నింటిని గుర్తించి కూల్చేస్తామని తెలిపారు గ్రామ సర్పంచ్.