
మహిళల మహిళల వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ నిరాశగా గురి చేస్తోంది. మంగళవారం (సెప్టెంబర్ 30) ఇండియా, శ్రీలంక మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి శ్రీలంక బౌలింగ్ ఎంచుకోగా.. టీమిండియా మొదట బ్యాటింగ్ చేస్తోంది. మొదట 10 ఓవర్లు ముగిసేసరికి ఇండియా వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. క్రీజ్ లో ప్రతీక్ రావల్ (18), హర్లీన్ డియోల్ (15) ఉన్నారు. సూపర్ ఫామ్ లో ఉన్న స్మృతి మందాన కేవలం 8 పరుగులు చేసి ఔటైంది. ఉదేశిక ప్రబోధని మందాన వికెట్ తీసుకుంది.
టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కు దిగిన ఇండియా తొలి రెండు ఓవర్లు ఆచితూచి ఆడింది. మూడో ఓవర్లో మందాన రెండు ఫోర్లు బాదడంతో ఇన్నింగ్స్ వేగం మొదలయింది. నాలుగో ఓవర్లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. అద్భుతమైన ఫీల్డ్ సెట్ చేసి స్మృతి మందాన వికెట్ తీసింది. ఈ దశలో హర్లీన్ డియోల్ తో కలిసి రావల్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లింది. రెండో వికెట్ కు అజేయంగా 29 పరుగులు జోడించిన తర్వాత వర్షం మ్యాచ్ కు అంతరాయం కలిగించింది. కాసేపు వర్షం తగ్గిపోవడంతో మ్యాచ్ 4:35 నిమిషాలకు మరల ప్రారంభమవుతుందని అంపైర్లు తెలిపారు.
మహిళల వరల్డ్ కప్ మ్యాచ్ లన్ని జియో హాట్ స్టార్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. లైవ్ టెలికాస్టింగ్ కు వస్తే టెలివిజన్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో లైవ్ చూడొచ్చు. హోమ్‌గ్రౌండ్‌లో ఆడటం ఇండియాకు అతి పెద్ద బలం. ఇటీవలే ఇంగ్లండ్‌పై వన్డే, టీ20 సిరీస్‌లను గెలవడం, బలమైన ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో గట్టి పోటీ ఇవ్వడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మరోవైపు శ్రీలంక తొలి మ్యాచ్ లో ఇండియాకు ఎలాగైనా గట్టి షాక్ ఇవ్వాలని చూస్తోంది.
శ్రీలంక మహిళా (ప్లేయింగ్ XI):
చమరి అతపత్తు (కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, విష్మి గుణరత్నే, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(w), అచ్చిని కులసూర్య, సుగండిక కుమారి, ఉదేశిక ప్రబోధని, ఇనోకా రనవీర
భారత మహిళలు (ప్లేయింగ్ XI):
ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి