Cricket World Cup 2023: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు

Cricket World Cup 2023: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..  భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు

ఆదివారం(అక్టోబర్ 22) భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ చూడడానికి రెడీ అయిపోయిన అభిమానులకి ఒకరకంగా ఇది బ్యాడ్ న్యూస్. ధర్మశాలలో జరిగే ఈ  మ్యాచుకు వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. సహజంగానే ధర్మశాలలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఇక్కడ దాదాపు 12-13 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. వాతావరణ శాఖ ప్రకారం.. ఈ రోజు మధాహ్న సమయంలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు తెలియజేస్తుంది.   

అదేవిధంగా 43 శాతం వర్షం పడే సూచనలు కనిపిస్తన్నాయి. అదే జరిగితే టాస్ సమయంలో ఆలస్యం కావొచ్చు. ధర్మశాలలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్‌తో 74 శాతం మేఘావృతమై ఉంటుంది. దీంతో మ్యాచ్ జరిగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. వరల్డ్ కప్ లో చివరిసారిగా ధర్మశాలలో నెదర్లాండ్స్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఈ మ్యాచులో వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచును  43 ఓవర్లకు కుదించారు. 

ALSO READ : యూట్యూబర్..ఫ్యాషన్‌తో ఆత్మవిశ్వాసం ​

ఈ వరల్డ్ కప్ లో భారత్, కివీస్ జట్లు కూడా ఆడిన నాలుగు మ్యాచుల్లో గెలిచి మంచి జోరు మీద ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలవడంతో వీరి సెమీస్ అవకాశాలు మరింత మెరుగు పడతాయి. దీంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే రెండు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు.