హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం

హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం

హైదరాబాద్ లో  వర్షం నాన్ స్టాప్ గా పడుతోంది. సాయంత్రం వరకు ముసురు వాన పడినా.. గంట నుంచి భారీ వర్షం పడుతోంది. మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చిన వాన.. మళ్లీ దంచి కొడుతోంది. సిటీలోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది.  బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బోరబండ,  పంజాగుట్ట,  అమీర్ పేట, కూకట్ పల్లి,లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్,గచ్చిబౌలి, మణికొండ, సికింద్రాబాద్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్,ఉప్పల్, చార్మినార్, రాజేంద్ర నగర్,మలక్ పేటలో  వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. కొన్ని కాలనీలు నీటమునిగాయి. 

రోడ్లపైకి భారీగా వరద చేరుకుంది. లోతట్టు కాలనీల్లోకి కూడా వరద చేరుతోంది. ఇప్పటికే కాలనీల్లో ఉన్న వరద పోలేదు. ఇప్పుడు కొత్తగా వస్తున్న వరదతో ఇళ్లు మునిగిపోతాయేమోనన్న భయం కాలనీ వాసుల్లో కనబడుతోంది.

రాబోయే రెండు  రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఇప్పటికే  జీహెచ్ఎంసీ హెచ్చరించింది. అవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. 
మరో వైపు జులై 26,27 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని కేసీఆర్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు.