టీమిండియాలో రీ ఎంట్రీపై స్పందించిన రైనా

టీమిండియాలో రీ ఎంట్రీపై స్పందించిన రైనా

భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఎడిషన్ లో ఇండియా మహారాజాస్ టీం తరుపున ఆడుతున్నాడు. వరల్డ్ జెయింట్స్‌తో బుధవారం (మార్చి 15) జరిగిన మ్యాచ్ లో రైనా 41 బంతుల్లో 2ఫోర్లు, 3 సిక్సర్‌లతో 49 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే, మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన రైనా.. టీమిండియాలో తన పునరాగమం గురించి స్పంధించాడు. 

‘అద్భుతంగా ఆడారు.. ఐపీఎల్ లో, టీమిండియా తరుపున మీ పునరాగమనాన్ని త్వరలో చూడొచ్చా’ అని మీడియా ప్రతినిది అడిగిన ప్రశ్నకు  రైనా జవాబిస్తూ.. ‘నేను రైనాని.. షాహిద్ అఫ్రిదీని కాదు’ అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. 

ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన రైనా 2022, ఐపీఎల్ లో ఏ జట్టుకు అమ్ముడుపోలేదు. దాంతో ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ప్రస్తుతం ఆడుతున్నా సిరీసుల్లో సూపర్ గా రాణిస్తున్న రైనా.. మళ్లీ పునరాగమనం ఇచ్చే ఛాన్స్ ఉందని వార్తులు వినిపించాయి. అయితే, ఈ ఆన్సర్ ద్వారా ఆ ప్రశ్నలన్నింటికీ జవాబులిచ్చాడు.

2015లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అఫ్రిది.. కొంతకాలానికి ఆ రిటైర్మెంట్ ని వెనక్కి తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఇప్పుడు రైనా వ్యంగ్యంగా వాడుకున్నాడు.