రెయిన్‌బోలో అథ్లెటిక్ హార్ట్ క్లినిక్

రెయిన్‌బోలో  అథ్లెటిక్ హార్ట్ క్లినిక్

హైదరాబాద్, వెలుగు: వరల్డ్ హార్డ్ డే సందర్భంగా రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్(ఆర్సీహెచ్ఐ) క్రీడాకారులు, పిల్లలకు అత్యాధునిక సేవలను అందించేందుకు రెయిన్‌బో అథ్లెటిక్ హార్ట్ క్లినిక్ ను ప్రారంభించింది. ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్  సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి బ్యాడ్మింటన్ దిగ్గజం గోపీచంద్ పుల్లెల క్లినిక్‌ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఆర్సీహెచ్ఐ డైరెక్టర్ డాక్టర్​ దినేశ్​చిర్ల మాట్లాడుతూ.. ఇండియాలో వెయ్యి మంది పిల్లలలో 9 మంది పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో(సీహెచ్‌డీలు) జన్మిస్తున్నారని, ఏటా దాదాపు 2 లక్షల మంది పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. 

2022లో స్థాపించబడిన పీఎల్​హెచ్ఎఫ్  ఇప్పటివరకు 500 మందికి పైగా నిరుపేద పిల్లలకు ప్రాణాలను రక్షించే గుండె శస్త్రచికిత్సలు, చికిత్సల్లో సహాయపడిందని పేర్కొన్నారు. జాతీయ ఉత్తమ బాల నటి సుకృతి వేణి బండ్రెడ్డి, లారస్ ల్యాబ్స్ సీఈవో చావా సత్యనారాయణ, ఫౌండేషన్ చైర్‌పర్సన్ యుగంధర్ మేక  పాల్గొన్నారు. వరల్డ్​ హక్ష్మీఆర్ట్​ డే సందర్భంగా కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గోకల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం బంజారాహిల్స్​ లోని కేబీఆర్ పార్క్ వద్ద వాక్​థాన్​ నిర్వహించగా పుల్లెల గోపీచంద్​ గెస్ట్​గా హాజరయ్యారు