V6 News

రైన్ కోట్స్ కి పెరుగుతున్న గిరాకీ

 రైన్  కోట్స్ కి పెరుగుతున్న గిరాకీ

సిటీలో మూడ్రోజులుగా ముసురు పడుతుండడంతో  రెయిన్​ కోట్స్ అమ్మకాలకు గిరాకీ పెరిగింది.  ఢిల్లీ, బెంగళూర్‌‌, ముంబయి, కోల్ కతా తదితర ప్రాంతాల నుంచి రెయిన్ కోట్స్​ను తీసుకొచ్చి చార్మినార్‌‌, కోఠి, అబిడ్స్‌, సికింద్రాబాద్‌, అమీర్‌‌పేట, ఎర్రగడ్డ ప్రాంతాల్లో ఫుట్ పాత్​ల మీద అమ్ముతున్నారు. మరోవైపు బేగంబజార్​తో పాటు ఇతర చిన్న షాపుల్లో  రూ. 300 నుంచి  రూ. 3 వేల వరకు, షోరూమ్స్ లో రూ.1,500 నుంచి రూ. 4 వేల వరకు వివిధ డిజైన్‌, రంగుల్లో రెయిన్ కోట్స్ అందుబాటులో ఉన్నాయి.  

వానకు, చలికి రెండు రకాలుగా ఉపయోగపడేలా ఉండే రెయిన్ కోట్స్ ను కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారని షాప్​ల నిర్వాహకులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి వానలు ఆలస్యంగా మొదలవడంతో ఇప్పుడిప్పుడే గిరాకీ  పెరుగుతోందంటున్నారు.  –వెలుగు, హైదరాబాద్​