నేడు, రేపు మోస్తరు వర్షాలు

నేడు, రేపు మోస్తరు వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం

హైదరాబాద్‌, వెలుగు: రానున్న 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ఇది ఉధృతంగా మారి 48 గంటల్లో వాయు గుండంగా మారొచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం శనివారం తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, సోమవారం అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. సిద్దిపేటలోని కొండపాకలో అత్యధికంగా 65.3 మిల్లీమీటర్లకు వర్షపాతం నమోదైంది. మెదక్‌లో 48, శివంపేటలో 46, మంగళపర్తిలో 45.5 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డయింది.