రాష్ట్రానికి రెండు రోజులు వర్ష సూచన

రాష్ట్రానికి రెండు రోజులు వర్ష సూచన

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది.  ప్రస్తుతం ఉపరితల ద్రోణి దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు.. సముద్ర మట్టం నుంచి సగటున 0.9 కి.మీల ఎత్తులో విస్తరించి ఉందని వెల్లడించింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఎల్లుండి కూడా రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఐఎండీ నివేదిక ప్రకారం.. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్ లో అత్యధికంగా 106 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన సంగతి తెలిసిందే.