
భారీ వర్షాలు మెదక్ జిల్లాను ముంచెత్తాయి. వానలకు చెరువులు అలుగులు నిండి ప్రవహిస్తున్నాయి. దీంతో భారీ వరదలకు జిల్లా మొత్తం జలమయం అయ్యింది. నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. ఏకంగా వాహనాలు కొట్టుకుపోయిన పరిస్థితి.
మెదక్ జిల్లా వానలపై ఆ జిల్లా ఇంఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరా తీశారు. బుధవారం (ఆగస్టు 27) జిల్లా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఎక్కడెక్కడ ఎలాంటి నష్టం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలన ఆదేశించారు మంత్రి.
భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడంతో పాటు జనం పడుతున్న ఇబ్బందులు గురించి అడుగు తెలుసుకున్నారు మంత్రి. జిల్లాలోని స్థానిక నాయకులను , అధికారులను వర్షం తీవ్రత , ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా సూచించారు.
ఇక మెదక్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో దాదాపు 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. నాగపూర్, సర్దనా లో 20 సెంటీమీటర్లు, రామాయం పేటలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు మెదక్ జిల్లాలోని రామాయంపేట పట్టణంలో ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజ్ హాస్టల్ నీట మునిగింది. వరదల్లో చిక్కుకున్న 350 మంది విద్యార్థులను రెస్క్యూ టీం సేఫ్ గా రక్షించింది. విద్యార్థినీలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.