
నిన్న మంగళవారం రాత్రి నుండి తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో తీవ్ర వరదలు సంభవించాయి. దింతో ప్రజలు ఇళ్లలోనే చిక్కుకోగా, రోడ్లు జలమయమై రాకపోకలు నిలిచిపోయాయి.
అయితే కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం నుండి సంగమేశ్వర్ గ్రామానికి వెళ్ళే మార్గంలో వాగులో ఓ కారు చిక్కుకుంది. దింతో జెసిబి సహాయంతో వారిని రక్షించేందుకు ప్రయత్నించగా వాగు ఉదృతికి కారుతో సహా ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. అయితే గల్లంతైన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే కామారెడ్డి పెద్ద చెరువు పొంగిపొర్లడంతో సుమారు పదిహేను కార్లు, పన్నెండు బైక్‌లు వరదల్లో కొట్టుకుపోయాయని సమాచారం.
►ALSO READ | రామాయంపేటలో వరదల్లో చిక్కుకున్న గర్ల్స్ హాస్టల్.. 350 మంది విద్యార్థినీలు సేఫ్