
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. అత్యంత భారీ వర్షాలకు కామారెడ్డి, మెదక్ జిల్లాలు అతలాకుతలం అవుతోన్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగిపోతున్నాయి. గ్రామాలు,తండాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలకు మెదక్ జిల్లాలోని రామాయంపేట పట్టణంలో ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజ్ హాస్టల్ నీట మునిగింది. వరదల్లో చిక్కుకున్న 350 మంది విద్యార్థులను రెస్క్యూ టీం సేఫ్ గా రక్షించింది. విద్యార్థినీలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
మరో వైపు భారీ వర్షాలు పడుతుండటంతో కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఆగస్టు 28న సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ . కామారెడ్డిలోని పలు లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నీటమునిగాయి. జిల్లాలోని ఆర్గొండలో అత్యధికంగా 31.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.మెదక్ లోని నాగపూర్ లో 20.88 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. కామారెడ్డి జిల్లాలోని బికనూరు లో 19.1 సెంటీమీటర్లు, పాత రాజంపేట్ లో 18.9 సెంటీమీటర్లు, దోమకొండ లో 16.5 సెంటీమీటర్లు , మెదక్ జిల్లాల్లో రామాయంపేటలో 16 సెంటీమీటర్లు, మెదక్ లోని మరో రెండు ప్రాంతాల్లో 13 సెంటీమీటర్ల అత్యధిక భారీ వర్షపాతం నమోదయ్యింది.
►ALSO READ | ఓ మైగాడ్.. కాగితం పడవలా కొట్టుకుపోయిన కారు.. మెదక్ జిల్లాలో నక్కవాగు ఉగ్రరూపం