బెంగళూరు వాసులకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా 

బెంగళూరు వాసులకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా 

గత కాంగ్రెస్ దుష్పరిపాలన వల్లే  నీటి ఎద్దడి ఏర్పడిందని  కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై అన్నారు. కుడి, ఎడమ, మధ్యలో సరస్సుల నిర్మాణానికి అనుమతిచ్చారన్నారు. బెంగళూరులో వరద పోయేందుకు 1500 కోట్లు.. ఆక్రమణలు తొలగించేందుకు 300 కోట్లు మంజూరు చేశామ్నారు.  మాండ్య జిల్లాలో తాగునీటి పంప్ హౌస్ లపై  వరద ప్రభావం చూపించిందన్నారు. సాయంత్రంలోగా పంప్ హౌస్ ను క్లియర్ చేస్తామన్నారు. ట్యాంకర్లు, బోర్ వెల్ ల ద్వారా నీటిని అందిస్తున్నామన్నారు. భవిష్యత్ లో వరద రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు బొమ్మై.

బెంగళూరులో మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయని  సీఎం బొమ్మై చెప్పారు.  ముఖ్యంగా మహదేవపురలో 69 చోట్ల డ్రైనేజీలో పొంగిపొర్లుతున్నాయన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు, ఇంజినీర్లు సహాయక చర్యలు ముమ్మరం చేశారని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరూ అధైర్య పడొద్దని యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామన్నారు.