28 నుంచి ‘రైతు బంధు’ సొమ్ములు జమ

28 నుంచి ‘రైతు బంధు’ సొమ్ములు జమ

రైతులకు శుభవార్త. ఈ వానాకాలం పంటకు సంబంధించిన పెట్టుబడి సాయం కోసం ‘రైతుబంధు’ నిధులను ఈనెల 28వ తేదీ నుంచి అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. పెట్టుబడి సాయంగా ఈ నిధులను రైతులు వినియోగించుకోనున్నారు. ఈవిషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపింది.