JUGARI CROSS : పుర్రెలు, పారుతున్న ర‌‌‌‌‌‌‌‌క్తం, మార‌‌‌‌‌‌‌‌ణాయుధాలు..ప్రోమోతో అంచనాలు పెంచిన రాజ్ బి శెట్టి

JUGARI CROSS : పుర్రెలు, పారుతున్న ర‌‌‌‌‌‌‌‌క్తం, మార‌‌‌‌‌‌‌‌ణాయుధాలు..ప్రోమోతో అంచనాలు పెంచిన రాజ్ బి శెట్టి

కన్నడ నటుడు రాజ్ బి శెట్టి... నటుడిగానే కాక రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన శైలిలో దూసుకెళుతున్నాడు. కన్నడ ఇండస్ట్రీలో విలక్షణ చిత్రాలకు కేరాఫ్ అంటే రాజ్ బి. శెట్టి అనే చెప్పాలి. ఆయన చేసిన సినిమాల లిస్టు చూస్తే అది క్లియర్గా అర్థంవుతుంది. ఇటీవల ఆయన నిర్మాతగా వ్వవహరిస్తూ కీలకపాత్ర పోషించిన ‘సు ఫ్రమ్ సో’ బ్లాక్ బస్టర్ సక్సెస్‌‌‌‌‌‌‌‌ సాధించింది. తెలుగులోనూ ఈ చిత్రం మంచి గుర్తింపును అందుకుంది.

లేటెస్ట్గా తను వన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ది లీడ్‌‌‌‌‌‌‌‌గా ‘జుగారి క్రాస్‌‌‌‌‌‌‌‌’ అనే సినిమా రాబోతోంది. ఇదే పేరుతో ప్రముఖ రచయిత పూర్ణచంద్ర తేజస్వి రాసిన నవల ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. గురుదత్త గనిక నటిస్తూ, దర్శకనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ టైటిల్‌‌‌‌‌‌‌‌ ప్రోమోను విడుదల చేశారు.

పుర్రెలు, పారుతున్న ర‌‌‌‌‌‌‌‌క్తం, మార‌‌‌‌‌‌‌‌ణాయుధాలతో ప్రజెంట్‌‌‌‌‌‌‌‌ చేసిన ఈ ప్రోమో సినిమాపై ఆసక్తిని రేపుతోంది. మరోవైపు ఇదే దర్శకుడు తెరకెక్కిస్తున్న ‘కరావలి’ అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాజ్ బి శెట్టి లీడ్ రోల్ చేస్తున్నాడు. అలాగే తను లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో ఉపేంద్ర, రాజ్ బి శెట్టి కీలకపాత్రలు పోషించిన ‘45’ అనే చిత్రం డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విడుదల కానుంది.