నిరుపేద‌ల ఆక‌లి తీర్చేందుకు రాజ్‌భ‌వ‌న్ అన్నం

నిరుపేద‌ల ఆక‌లి తీర్చేందుకు రాజ్‌భ‌వ‌న్ అన్నం

రాజ్‌భ‌వ‌న్ అన్నం కార్య‌క్ర‌మాన్ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ సోమ‌వారం ఉద‌యం రాజ్‌భ‌వ‌న్‌లో ప్రారంభించారు. నిరుపేద‌ల ఆక‌లి తీర్చేందుకు రాజ్‌భ‌వ‌న్ అన్నం పేరుతో ఈ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని రూపొందించారు. ఆరోగ్య‌క‌ర‌మైన దేశం కోసం ఆరోగ్య‌క‌ర‌మైన పౌష్టికాహారం అవ‌స‌ర‌మ‌న్నారు. విద్యార్థులు, శానిటేష‌న్ సిబ్బందితో క‌లిసి బ్రేక్ ఫాస్ట్ చేయ‌డంతో ఎంతో సంతోషాన్ని ఇచ్చింద‌ని తెలిపారు గవర్నర్ త‌మిళిసై.

రాజ్‌భ‌వ‌న్ అన్నం కార్య‌క్ర‌మంలో భాగంగా రాజ్‌భ‌వ‌న్ పాఠ‌శాల విద్యార్థులు, పారిశుద్ధ్య కార్మికుల‌కు ఉచితంగా టిఫిన్ అందించనున్నారు. ప్ర‌తి రోజు 500 మంది నిరుపేద‌ల‌కు టిఫిన్‌, భోజ‌న స‌దుపాయం క‌ల్పించ‌నున్నారు. ఉచితంగా టిఫిన్‌, నామ‌మాత్ర‌పు రుసుముతో మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం అందించ‌నున్నారు. రాజ్‌భ‌వ‌న్ అన్నం కార్య‌క్ర‌మాన్ని స‌త్య‌సాయిబాబా సేవా ట్ర‌స్ట్ స‌హాకారంతో చేప‌ట్టారు.