అనుభవించు రాజా మూవీ రివ్యూ

అనుభవించు రాజా మూవీ రివ్యూ

టైటిల్: అనుభవించు రాజా
రన్ టైమ్: రెండు గంటల 20 నిమిషాలు
నటీనటులు: రాజ్ తరుణ్, కశిష్ ఖాన్, ఆడుకాలం నరేన్, రవికృష్ణ, సుదర్శన్, భూపాల్, అజయ్, ఆరియానా తదితరులు
సినిమాటోగ్రఫీ: నగేశ్ బనెల్
మ్యూజిక్: గోపీ సుందర్
ఎడిటర్: చోటా కె ప్రసాద్
నిర్మాత: సుప్రియ యార్లగడ్డ
రచన, దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి
రిలీజ్ డేట్: నవంబర్ 26,2021

కథేంటి?

రాజ్ (రాజ్ తరుణ్) హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో సెక్యురిటీ గార్డ్ గా పని చేస్తుంటాడు. అదే ఆఫీస్ లో ఎంప్లాయిగా పని చేస్తున్న శృతి (కశిష్) రాజ్ ను తోటి ఎంప్లాయ్ అనుకుని లవ్ చేస్తుంది. కానీ నిజం తెలుససుకున్న తర్వాత షాక్ అవుతుంది. ఇదే టైమ్ లో రాజ్ తననే చంపాలని సుపారీ గ్యాంగ్ కు డబ్బులిచ్చి ఎటాక్ చేయించుకుంటాడు. ఇంతకు ఎందుకలా చేశాడు.. శృతి ఎలా రియాక్టయింది.. ఇది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

నటీనటుల పర్ఫార్మెన్స్

రాజ్ తరుణ్ ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు. తన స్టైల్ ఆఫ్ హ్యూమర్ పండించాడు. ఆద్యంతం ఎంటర్ టైన్ చేయడానికి ట్రై చేశాడు. హీరోయిన్ కశిష్ ఖాన్ ఓకే . నటనలోనూ అందంలోనూ యావరేజ్. రవికృష్ణ ఉన్న కొద్దిసేపు అయినా ఆకట్టుకున్నాడు. ఆడుకాలం నరేన్ రాణించాడు. అజయ్, భూపాల్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ వర్క్

నగేష్ బెనెల్ సినిమాటోగ్రఫీ బాగుంది. గోపీ సుందర్ ఇచ్చిన పాటల్లో ఒకటి బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. ఎడిటింగ్ లో ల్యాగ్ ఉంది. ఇంకాస్త క్రిస్ప్ గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూయ్స్ ఓకే. యాక్షన్ సీన్లు బాగున్నాయి. డైలాగులు కొన్ని బాగున్నాయి.

విశ్లేషణ

‘‘అనుభవించు రాజా’’ రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్. కథ పాతది. కథనంలో అయినా కొత్తదనం ఉందా అంటే అదీ లేదు. యంగ్ డైరెక్టర్ శ్రీను ఓల్డ్ ఫార్మాట్ నే ఎంచుకున్నాడు. ఫస్టాఫ్ అంతా సాఫ్ట్ వేర్ కంపెనీ చూట్టూ ఓ లవ్ ట్రాక్ నడిపాడు. ఆ ఎపిసోడ్ బోరింగ్ గా ఉంది. కథకు ఆ ట్రాక్ పెద్దగా అవసరం లేదు. అయినా ఎందుకో బాగా డ్రాగ్ చేశారు. అసలు కథ సెకండాఫ్ లో మొదలవుతుంది. అది కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ లో ట్విస్టు తేలిపోయింది. ఇంత చిన్న కథకు అంత పెద్ద సెటప్ ఎందుకో అర్థం కాదు. అప్పటికే ప్రేక్షకులకు నీరసం వచ్చేస్తుంది. ఓటీటీలో మంచి  కథలు, కొత్త కాన్సెప్టులు దొరుకుతున్నప్పడు ఇలాంటి ఔట్ డేటెడ్ కథల కోసం ఎవరూ థియేటర్ కు రావాలనుకోరు. ఓవరాల్ గా ‘‘అనుభవించు రాజా’’ ఆకట్టుకోదు.

బాటమ్ లైన్: నెగ్గడం కష్టం రాజా.