అకాడమీ రత్న’ అవార్డు అందుకున్న 

అకాడమీ రత్న’ అవార్డు అందుకున్న 
  • రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ప్రదానం

న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణకు చెందిన ప్రముఖ కూచిపూడి కళాకారులు రాజా రాధా రెడ్డి దంపతులు 2022–23 ఏడాదికి గాను నాటక రంగంలో ప్రతిష్టాత్మకమైన ‘అకాడమీ రత్న’ అవార్డును అందుకున్నారు. బుధవారం కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రాజా రాధా రెడ్డి దంపతులకు వేర్వేరుగా రాష్ట్రపతి ముర్ము అవార్డులను అందజేశారు.

వీరితో పాటు వినాయక్ ఖేదేకర్, ఆర్ విశ్వేశ్వరన్, సునయన హజరిలాల్, దులాల్ రాయ్, డీపీ సిన్హా అకాడమీ రత్న అవార్డులు అందుకున్నారు. అలాగే తెలంగాణ కు చెందిన పేరిణి ప్రకాశ్, ఏపీకి చెందిన భాగవతుల సేతురాం, ముద్దాల ఉషా గాయత్రి, మంద (అలమురు) సుధ, ఎల్ వీ గంగాధర శాస్త్రీ, వినుకొండ సుబ్రమణ్యంలు  సంగీత నాటక అవార్డులను అందుకున్నారు. మొత్తంగా 92 మందికి అకాడమీ పురస్కార్ అవార్డులను కేంద్రం అందజేసింది.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సహాయ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ పాల్గొన్నారు. అకాడమీ రత్న అవార్డు గ్రహీతలకు3 లక్షలు, అకాడమీ పురస్కార గ్రహీతలకు రూ.లక్ష నగదు, తామ్రపత్రం, అంగవస్త్రాన్ని అందజేశారు.