రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు

రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు

తెలంగాణ ప్రజలను కాపాడాల్సిన పోలీస్ లు వేరే పనుల్లో బిజీ గా ఉన్నారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అంతేకాదు.. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే లు ఏటు వెళ్తున్నారు.. వాళ్ళ ఫోన్ లు ట్యాప్ చేయడం...బై ఎలక్షన్ ల్లో పని చేయడం...సీఎం కేసీఆర్ కు  వివరాలు అందించడం లో పోలీసులు బిజీ అయ్యారన్నారు. తెలంగాణలో హత్యలు, అత్యాచారాలు,దొంగతనాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. పోలీసులు సరిగా పని చేస్తలేరని విమర్శించారు. సీఎంకు  గులాంగిరి చేస్తే పదోన్నతులు వస్తాయి అనే ఫీలింగ్ లో కొంత మంది పోలీసులు ఉన్నారని ఆరోపించారు.

పోలీసులు పెట్రోలింగ్ కూడా సరిగా చేయడం లేదని తెలిపారు రాజాసింగ్. హైదరాబాద్ లో  అర్థరాత్రి  రోడ్లపైన ఇష్టారాజ్యంగా తిరుగుతున్నా.. పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. హత్యలు,అత్యాచారాలు,దొంగతనాలు చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లే  రాత్రిళ్ళు రోడ్ల పై తిరుగుతారన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికపైనే కాకుండా.. మిగతా నియోజకవర్గాల అభివృద్ధి పై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు.