
పార్టీ మారే ఆలోచనలో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పలుచోట్ల నిరసనలు ఎదురవుతున్నాయి. నియోజకవర్గంలో ఆయన తన అనుచరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ మారే ఆలోచనపై ఆయన ఏకగ్రీవంగా మద్దతు దొరకలేదు. జై కాంగ్రెస్ నినాదాలతో రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే సభను వాకౌట్ చేశారు మునుగోడు నియోజకవర్గంలోని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో చౌటుప్పల్ ఎంపీపీ తాడూరు వెంకట్ రెడ్డి వాగ్వాదం చేశారు. కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉండాలని వెంకట్ రెడ్డి అన్నప్పుడు.. నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా… ఏదైనా ఉంటే ఇలా పక్కకొచ్చి చెవిలో చెప్పు… అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
మెజారిటీ నాయకులు, కార్యకర్తలు పార్టీ మారే నిర్ణయానికి మద్దతుగా ఉన్నట్టు రాజగోపాల్ రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. నాతో వస్తే రండి.. పోతే పొండి అన్నట్టుగా రాజగోపాల్ రెడ్డి వ్యవహరించారని నిరసన తెలిపిన నేతలు చెప్పారు. ఐతే.. నిరసన తెలిపిన నేతలతో తాను మాట్లాడతానని.. తాము అందరం ఒకే మాటపై ఉన్నామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.